
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ముప్కాల్ మండల కేంద్రంలో ఎస్ఐ కె.కిరణ్ పాల్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం సరైంది కాదన్నారు. ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమాని మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా అన్నారు. అందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటల పెట్రోలింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. రాత్రి పూట ఆయా గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు*..