
పయనించే సూర్యుడు న్యూస్ :కోలీవుడ్‌లో ధనుష్ ఉన్నంత బిజీగా మరేతర హీరో ఉండి ఉండడు. ధనుష్ ప్రస్తుతం హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, సింగర్‌గా ఇలా అన్ని క్రాఫ్ట్‌ల్లో తన సత్తాను చాటుకుంటున్నాడు. దర్శకుడిగా భిన్న చిత్రాలు చేస్తున్నాడు. నిర్మాతగా అభిరుచిని చాటుకుంటున్నాడు. హీరోగానూ విలువలతో కూడిన చిత్రాల్ని, సందేశాన్నిచ్చే కథల్ని ఆడియెన్స్‌కి అందిస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామితో మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అమరన్’ రిలీజ్ కంటే ముందే ధనుష్ ఈ మూవీని చేస్తానని మాటిచ్చాడట. ఇక ఈ మూవీని మధురై అన్బు గోపురమ్ ఫిల్మ్స్ నిర్మించాల్సి ఉంది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్, బడ్జెట్ పెరుగుతూ ఉండటం మూలానా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. ఇక మధ్యలో చేసేది ఏమీ లేక ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యతని ధనుష్ నెత్తిన వేసుకున్నాడట. ఈ మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించి కంప్లీట్ చేసేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పుడు ఈ చిత్రానికి హీరోగా, నిర్మాతగా అన్నీ తానై చూసుకుంటున్నాడని సమాచారం.ఇక ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్‌కి మమ్ముట్టిని తీసుకోవాలని అనుకుంటున్నారట. కానీ ఆయన 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి అసలే బడ్జెట్ సమస్యలు ఈ మూవీకి బోలెడన్ని ఉన్నాయి. ఈ టైంలో మమ్ముట్టిని ఈ టీం భరించగలదా? లేదా? అన్నది కష్టమే. ఇక సాయి పల్లవి ఈ చిత్రంలో ఎమోషనల్ కారెక్టర్‌ను పోషిస్తోందట. అమరన్ మూవీలో మాదిరిగానే ఇందులోనూ ఆమె పోషించే పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని సమాచారం. ధనుష్ చివరగా ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు) అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో అయితే ఆడలేదు. కనీసం కోలీవుడ్‌లో కూడా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. తెలుగులో అయితే మరీ దారుణంగా బెడిసికొట్టేసింది. కనీస వసూళ్లను కూడా సాధించినట్టుగా కనిపించలేదు. ఇక ఓటీటీలోకి ఈ మూవీ వచ్చిన తరువాత కొంత మంది మాత్రం సినిమా బాగుందని, మంచి సందేశాన్ని ఇచ్చారంటూ ప్రశంసలు కురిపించారు. ధనుష్ మంచి ప్రయత్నం చేశాడని మెచ్చుకున్నారు. అమరన్ దర్శకుడికి కోలీవుడ్‌లో ఏర్పడిన డిమాండ్ అందరికీ తెలిసిందే. కమల్, రజినీ వంటి వారు రాజ్ కుమార్ పెరియసామిని అభినందించారు. స్టార్ హీరోలు రాజ్ కుమార్‌కు డేట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ అమరన్ విడుదల కంటే ముందే ధనుష్ తన కథకు ఓకే చెప్పడంతో ఈ మూవీని రాజ్ కుమార్ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.