పయనించే సూర్యుడు జనవరి 11 : ప్రతినిధి భూక్యా కవిత: జగ్గయ్యపేట మండలంలోని ధర్మవరప్పాడు తండా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని విద్యార్థులు రంగు రంగుల రంగవల్లులు నడుమ గొబ్బెమ్మలను ను ఆటపాటలు ఆడి భోగిమంటలు వేసి గాలి పటాలు ఎగురవేశారు.ఈ సందర్భంగా ధర్మవరప్పాడు తండా కమ్యూనిటీ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ విద్యార్థులు కు గాలి పటాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని.కసుకుర్తి మంగతాయమ్మ ,ఉపాధ్యాయులు పర్చా లక్ష్మణరావు, టీవి సుజాత ఆరోగ్య మేరి, దయామణి, వసంత, సుభాషిణి పాల్గొన్నారు.