ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించవద్దు
షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్
మార్కెట్ యార్డులో రైతులకు అవగాహన కల్పించిన కమిటీ సభ్యులు
మద్దతు ధరతో పాటు 500 బోనస్ అందుకోండి
రైతులతో మాట్లాడిన వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం
( పయనించే సూర్యుడు మే 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గంలో రైతాంగం తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించాలని ప్రైవేట్ వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ సూచించారు. సోమవారం షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు స్థానిక పాలకవర్గం సభ్యులతో కలిసి మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ అవగాహన కల్పించారు. ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని వికరించవద్దని ప్రభుత్వానికి ఇస్తే క్వింటాలుకు రూ.2350 తో పాటు 500 తెలంగాణ ప్రభుత్వం బోనసిస్తుందని బాబర్ తెలిపారు. మార్కెట్ యార్డులో డైరెక్టర్లు కరుణాకర్, మల్లేష్, భరత్ లాహాటి తదితరులతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్ యార్డులో రైతులు పెంటయ్య లక్ష్మయ్య సేవ్య కృష్ణయ్య ముత్యం రెడ్డి తదితర రైతులతో పాలకవర్గం సభ్యులు మాట్లాడారు. ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వడం ద్వారా మద్దతు ధర కలుగుతుందని ప్రైవేట్ వ్యాపారులకు ఇవ్వడం వల్ల ఇష్టం సారంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా మార్కెట్ యార్డులో ప్రైవేట్ వ్యాపారులను కూడా కమిటీ సభ్యులు హెచ్చరించారు. ప్రభుత్వ మద్దతు ధరకు తక్కువగా ధాన్యం తీసుకోవద్దని సూచించారు. ఒకవేళ రైతులను ఇబ్బందులకు గురిచేస్తే లైసెన్సులు క్యాన్సల్ చేస్తామని హెచ్చరించారు. రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా మర్డర్ కమిటీ సభ్యులను సంప్రదించాలని తమకు ఫోన్ చేయాలని కోరారు. అదేవిధంగా రైతులు తమ ధాన్యం మార్కెట్ యార్డుకు తీసుకువచ్చేటప్పుడు తేమశాతం 17% ఉంచకుండా తీసుకురావాలని సరైన మద్దతు ధర పొందాలని సూచించారు. కొంతమంది రైతులు మార్కెట్ యార్డులో వ్యాపారస్తులతో ఉన్న సత్సంబంధాల వల్ల ధాన్యాన్ని సులువుగా చెప్తున్నారు అని కొంత వ్యక్తిగత అప్పులు ఇతర సమస్యలను చూపించి వారికి ధాన్యాన్ని అప్పజెప్తున్నారని ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి ప్రభుత్వ మద్దతు ధర వచ్చే విధంగా ధాన్యాన్ని తక్కువకు అమ్ముకోకుండా ప్రభుత్వానికి ఇవ్వాలని మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తదితర కమిటీ సభ్యులు సూచించారు. అనేక మంది రైతులతో మార్కెట్ పాలకవర్గం మాట్లాడుతూ వారికి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు..