పయనించే సూర్యడు // ఫిబ్రవరి // 23 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో మధ్యాహ్నం12 గంటల సమయంలో ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోయిన కార్మిక శాఖ అధికారి మరియు ఇతర సిబ్బంది, వార్డ్ మెంబర్ )ఈ సందర్బంగా మాట్లాడుతూ..కార్మిక శాఖ కార్యాలయం టైమ్, మధ్యాహ్నం 12 గంట్టలే, కావచ్చు అని తెలంగాణ రాష్టం వీళ్లకు కొత్త రూల్స్ ఇవ్వచ్చు, అని విజయ్ అన్నారు. ప్రజలకు అందుబాటలో లేకుండా,దళారులకు బ్రోకర్ వ్యవస్థకు పెద్ద పీట వేస్తున్న లేబర్ ఆఫీసర్ సుమారుగా కార్మిక శాఖ అధికారి పరిధిలో 2500 కు పైచిలుకు కేసులను పెండింగ్లో ఉంచి బ్రోకర్ల ద్వారా ఒక ఫైల్ కి మూడు వేల రూపాయలు ఇస్తే పని చేయడం జరుగుతుంది అన్నారు. సామాన్య ప్రజలు వెళితే ఫైలు తీసుకొని సుమారు 9 10 నెలలు తిప్పిoచుకొని మీరు ఇచ్చినటువంటి ఫైలు కనబడడం లేదు, అని మళ్లీ ఫైల్ ఇవ్వమని చెప్పడం జరుగుతుందన్నారు.సంబంధిత అధికారి పైన ఎన్నిసార్లు ఫిర్యాదులు వెళ్లిన ఉన్నతాధికారులు,పట్టించుకోవట్లేదు, అని వివరించారు. ఇకనైనా ఉన్నతధికారులు, పట్టించుకోవాలని తక్షణ చెర్యలు తీసుకోవాలని పార్లపెల్లి విజయ్ కుమార్ తెలిపారు.