
పయనించే సూర్యుడు నవంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల స్థానిక పట్టణంలోని రైతు బజార్ దగ్గర కేర్ బ్యూటీ ఎస్తేటిక్స్ ట్రైనింగ్ సెంటర్ ను పలువురు ప్రముఖులు ప్రారంభించారు.టీడీపీ నాయకులు మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి,డాక్టర్ రవికృష్ణ, మల్లికార్జున, లక్ష్మీ ప్రసన్న కుటుంబం తో ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఎంతోమంది నిరుద్యోగులు కు ఈ కోర్సు ఉపయోగ పడుతుందన్నారు. ఇలాంటి కోర్సులు చేయాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి చేయాలి అలాంటిది ఈ నంద్యాలకు రావడం పెద్ద గొప్పతనం అని తెలియచేసారు.ఈ కోర్సులో, హెయిర్,నెయిల్ కట్, స్కిన్, మేకప్, అడ్వాన్స్డ్ ఆస్స్తేటిక్స్ మొదలవు కోర్సులు ట్రైనింగ్ ఇవ్వబడును అని లక్ష్మీ ప్రసన్న చెప్పుకొచ్చారు. ఇది నంద్యాలలో చుట్టుపక్కల లో ఉన్న నిరుద్యోగులకు ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి కోర్సులు చేసి పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి ఉపాధి కల్పించుకోవచ్చు అని లక్ష్మీప్రసన్న చెప్పుకొచ్చారు ఇలాంటి కేర్ ను నంద్యాలకు తీసుకురావడం ఎంతో గొప్పతనం అని పలువురు ప్రముఖులు తెలియజేశారు.