పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న
ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ కట్టించినదే వాస్తవాలు హోం మంత్రి అనిత కళ్లకుకనిపించలేదా?.మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష
వైఎస్సార్సీపీ అధికారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆడుగులు వేసి అధికారంలో ఉన్న కాలంలోనే 5 మెడికల్ కళాశాలను సెప్టంబర్ నెల 15వ తేది 2023 సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాలు కావస్తున్నది. దిగ్విజయంగా మూడవ సంవత్సరం మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపడుతున్నది. ఇది వాస్తవం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో అమరావతిని సృష్టించినట్లు మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 5 మెడికల్ కళాశాలలను గ్రాఫిక్స్ చేయలేదని, ఇందుకు నిలువెత్తు సాక్షాలుగా నంద్యాల మెడికల్ కళాశాల ఉందని ఇది వాస్తవమని నిజాలు చారిత్రక నిర్మాణాలు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కళ్లకు కనిపించలేదా అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష హోమంత్రి చేసిన అసత్యపు ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు వాస్తవాలను, నిజానిజాలను ప్రజలకు కూటమి ప్రభుత్వ నేతలకు తెలియజేసేందుకు సోమవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాగణంలో కళాశాల ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి నిజాలను నిగ్గు తెల్చారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దశల వారిగా 5మెడికల్ కళాశాలను సెప్టంబర్ నెల 15వ తేది నాటికి నంద్యాల మెడికల్ కళాశాలతో సహా మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందన్నారు. నేటికి ఈ మెడికల్ కళాశాలలు ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి అయ్యాయని, అలాగే ఈ విద్యాసంవత్సరంలో 3వ సారి అడ్మిషన్ల ప్రక్రియకూడా ప్రారంభించి పూర్తి కావస్తుందని తెలిపారు. చారిత్రక ఆధారాలు ఉన్నవాటిని కూడా కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వార నంద్యాల మరియు ఇతర నాలుగు ప్రాంతాలలో నిర్మించిన మెడికల్ కళాశాలల ఆనవాళ్లు లేవని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయ చేశాడని మంత్రాలు వేస్తాడని హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు మాదిరి అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించినట్లు నంద్యాల మెడికల్ కళాశాలను చూపడం సాధ్యం కాదని ఒక్కసారి చారిత్రక మెడికల్ కళాశాల నిర్మాణాలను కళ్లుపెట్టుకుని చూడాలని వాస్తవాలను, నిజానిజాలను తెలుసుకొని మాట్లాడాలని మంత్రి అనిత చేసిన అసత్యపు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల మెడికల్ కళాశాలకు అనుమతులు రావడానికి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, నాటి జిల్లా కలెక్టర్ ఎంతో ప్రయత్నాలు చేసి చివరకు మెడికల్ కళాశాలను ప్రారంభించామని గర్వంగా చెబుతున్నామన్నారు. టీడీపీ నాయకులు మెడికల్ కళాశాల అనుమతులు రాకుండా కోర్టులలో కేసులు వేశారని అయినా అనేక సార్లు కోర్టుల వెంట తిరిగి మెడికల్ కళాశాలను సాధించామన్నారు. ఈ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు, రెండవ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు అలాగే ఈ విద్యా సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. నంద్యాల మెడికల్ కళాశాలకు చెందిన మహేష్ అనే ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థి యూనివర్సిటీ టాపర్ గా నిలిచాడన్నది చారిత్రాక సాక్షం అని నంద్యాల మెడికల్ కళాశాల ఎంతో గర్వకారణంగా నిలిచిందన్నారు. ఎన్.ఎం.సీ అనుమతులతో ప్రారంభించిన కళాశాలకు సంబంధించి ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలను నేటికీ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని, అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి అయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, కూటమి ప్రభుత్వం తమకు మెడికల్ కళాశాలకు అనుమతులు వద్దని అడ్మిషన్ల ప్రక్రియ రద్దు చేయమని ఎన్.ఎం.సి కి ఉత్తరాలు పంపారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విధానాలు లోపభూయిష్టమైనదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నేతలు నంద్యాల మెడికల్ కళాశాలను ఒక్కసారి టచ్ చేసి చూడాలని ఇది గ్రాఫిక్స్ తో చూపించారా,లేదా అన్న వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం వారు కళాశాలలోకి వెళ్లి అధికారులతో మాట్లాడి, అటు తర్వాత రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మెడికల్ కళాశాల ఆవరణంలో ఉన్న డా.వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మార్క్ఫెడ్ అధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ని సా, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీపీ మధు సూధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ పీఏ.సి.ఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల నాయకులు రసూల్ ఆజాద్, రమణ, ప్రతాప్ రెడ్డి, బసవేశ్వర రెడ్డి, శివయ్య, కారు రవికుమార్, దేవనగర్ బాష, జాకీర్ హుసేన్, గన్నీకరీం, సోహేల్ రాణా, సాయిరాంరెడ్డి, మునయ్య, లక్ష్మీనారాయణ, కిరణ్, షేక్ రహంతుల్లా, భాస్కర్ రెడ్డి, యూసఫ్, రామ సుబ్బారెడ్డి, కాల్వనాగరాజు, పార్థసారధి, కౌన్సిలర్లు, కృష్ణమోహన్, మేస చంద్రశేఖర్, సాధిక్, సమ్మద్, ఆరిఫ్ నాయక్, తమీమ్, మజీద్, అబ్దుల్ కరీం, మురళి, షేక్ తోహిద్,రామచంద్రుడు,చింత శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.