పయనించే సూర్యుడు అక్టోబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ముఖ్యఅతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్.
స్థానిక నంద్యాల పట్టణంలోని "శ్రీ సీతారామలక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి" దేవస్థానం నందు నాయి బ్రాహ్మణ మూలపురుషుడు శ్రీ ధన్వంతరి మహర్శి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్ విచ్చేశారు. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఊడుమాల్పురం మల్లుగాళ్ల సుబ్బరాయుడు, మల్లుగాళ్ల విజయలక్ష్మి వారి ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరి స్వామికి అభిషేకం, అర్చనలు, హోమ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు అన్ని రంగాల్లోనూ రాణించాలని, ప్రభుత్వం కూడా నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఆదరణ పథకం ద్వారా లోన్ కు అప్లై చేసుకున్న నాయి బ్రాహ్మణులకు బీసీ కార్పొరేషన్ తరపున కావలసిన కుర్చీ తదితర పరికరాలు అందజేస్తుందని, మరియు ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఇస్తున్నారని, భజన మండలి, మరియు కళ్యాణకట్టలో నాయి బ్రాహ్మణ సోదరులకు 20 వేల నుంచి 25 వేల రూపాయలకు పెంచడం జరిగిందని, చంద్రబాబు నాయుడు చొరువతొ తిరుపతి, శ్రీశైలం దేవస్థానంలో పాలకమండలి సభ్యులుగా నాయి బ్రాహ్మణులు ఉండాలని హక్కు కల్పించి జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ధన్వంతరి జయంతిని ప్రభుత్వం తరఫున నిర్వహించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేశారని తెలిపారు.ఈ సందర్భంగా మల్లుగాళ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ ధన్వంతరి గురించి ఇప్పటితరంలో చాలా మందికి తెలియదని, ఈ ధన్వంతరి ప్రస్తావన మన ప్రాచీన గ్రంథాల్లో, ధార్మిక ప్రచారాల్లో, వ్యావహారిక కథలతో పాటు అనేక సందర్భాల్లో వినిపిస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ధన్వంతరి అంటే ఆరోగ్య దేవత. సాగర మథనం తర్వాత ధన్వంతరి స్వామి ఒక చేతిలో అమృత భాండాన్ని, మరో చేతిలో శంఖాన్ని, ఇంకో చేతిలో చక్రాన్ని, ఇంకో చేతిలో జలౌకా ధరించి దర్శనమిచ్చినట్లు పురాణాలలో పేర్కొనబడిందన్నారు. పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు సాగర మథనం చేస్తున్నప్పుడు త్రయోదశి రోజున విష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని పట్టుకుని కనిపించాడు. అదే రోజున ధన్వంతరి పుట్టినరోజుగా భావిస్తారు. అప్పటినుంచి ప్రతి ఏటా ధన్వంతరి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు.
జాతీయ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకొని త్యాగరాజస్వామి దేవస్థానం నందు ఆయుష్ శాఖ నంద్యాల మరియు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి కీళ్లనొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి, గ్యాస్ ట్రబుల్ తదితర వ్యాధులకు ఉత్తముగా ఆయుర్వేద మందులను డా.యశోదర సీనియర్ మెడికల్ ఆఫీసర్, డా.సుబ్రహ్మణ్యం, నాగరాజు సిబ్బంది ఉచిత ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. అనంతరం నంద్యాల జిల్లాలో వైద్య రంగంలో పని చేయుచున్న ఆయుర్వేద, హోమియోపతి వైద్యులకు మరియు వాయిద్యకారులకు మరియు వివిద రంగాలలో వుండి నాయిబ్రాహ్మణ అభివృద్దికి కృషిచేస్తున్న పెద్దలకు ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తాదులందరికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యం.సుబ్రహ్మణ్యం (ఏఈ) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, రామ మద్దయ్య (టిడిపి కౌన్సిలర్), యం.శీనయ్య ట్రెజరర్, నాగ పుల్లయ్య (ట్రెజరర్), బాంబే వెంకటేశ్వర్లు, శేఖర్, చిందుకూరు శ్రీనివాసులు, తిరుపతయ్య, నాయీబ్రాహ్మణ బందువులు, మిత్రులు, భక్తులు అధిక సంఖ్యలో అత్యంత భక్తి శ్రద్దలతో పాల్గొనడం జరిగింది.*