
పయ నించే సూర్యుడు జూన్ 20 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
డివిజనల్ అభివృద్ధి అధికారి (డి డి ఓ )అమలాపురం, కె విజయభాస్కర్ కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామ పంచాయతీ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. స్వచ్చతకు కేంద్ర స్థానాలుగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను తీర్చి దిద్దడంలో సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని సూచించారు.స్వచ్ఛ గ్రామాలు తీర్చి దిద్దడంలో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు, సందర్శనలో ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు, నడవపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్ నాగేంద్ర, మండల పరిషత్ జూనియర్ సహాయకులు పృథ్వి, మండలం కంప్యూటర్ ఆపరేటర్ బాలాజీ & గోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు*