పయనించే సూర్యడు జనవరి 18 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దేవరంగుల వీరన్న, దుర్గారావు, పల్లపు నాగేశ్వరరావు, గుడిపల్లి సీతయ్య, చిలికేశ్వరపు లింగరాజు, బూరుగడ్డ తామస్, కొల్లు గణేష్, నరసయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు