పయనించే సూర్యడు జనవరి 30 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, కోదాడ మాజీ ఎమ్మెల్యే,బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ గౌ.శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారంగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది. సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్ మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తి చేసుకుంటుందన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు అన్నారు . ఆరు గ్యారెంటీల కార్డుకు ఇచ్చిన 420 హామీలను పాత రేసిండు అన్నారు. అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.ఇకనైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులకు ప్రజలకు మహిళలకు విద్యార్థులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్. మాజీ సర్పంచులు దున్న సుధాకర్. నూనె నాగన్న. పార్టీ సీనియర్ నాయకులు. బొల్లం శ్రీనివాస్. వందనపు మోహన్ రావు. గజ్జి అప్పారావు. మో రిశెట్టి రమణ. పల్లపు చిన్నులు.దున్న రవి ఉద్యమ నాయకులు ప్రవీణ్.మైనార్టీ నాయకులు. ఎస్ కే జలీల్ బుడే సాహెబ్,ఎస్ కే గౌస్ మండల యూత్ నాయకులు మేకల వీరబాబు. కన్నెబోయిన మురళీకృష్ణ.బొల్లం ఎల్లేష్.శ్రీరాముల వీరస్వామి. పార్టీ నాయకులు శ్రీరాముల సైదులు. గుంజ వీరబాబు. .బడేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు