పయనించే సూర్యడు జనవరి 12 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
నడిగూడెం మండల బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కోదాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా భువనగిరి వెళ్తుంటే దారిలో నడిగూడెం పోలీసులు అక్రమ అరెస్టు చేశారు . ఇచ్చిన హామీలు అమలు చేయమన్నందుకు
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని నడిగూడెం బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు
బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ము ఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఎన్నడూ కూడా ఇలాంటి దాడులు జరగలేదు. ప్రశ్నిస్తే దాడులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి.
సంవత్సరం కాలంలో దాడుల సంస్కృతి ఈ రేవంత్ రెడ్డి పాలనలో రోజురోజుకు పెరుగుతున్నాయి.
రుణమాఫీ పై మా సీనియర్ నాయకుడు,ఎమ్మెల్యే హరీష్ రావు నిలదీస్తే సిద్దిపేట లో క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారు.
ఖమ్మం లో వరద బాధితుల పక్షాన నిలబడి అండగా ఉంటే అక్కడ మా నాయకులపై దాడులు చేశారు.
హైడ్రా భాదితులకు అండగా ఉంటే రాజేంద్రనగర్ లో బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేశారు.
అంబర్ పెట్ లో మూసి భాదితులకు అండగా ఉంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు.
ఇలాంటి దాడులతో భయపడేది లేదు.మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ లు అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అదేశాలతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇలాంటి దాడులు చేసిన వారిని మీరు ప్రోత్సహిస్తారా ఇలాంటి సాంస్కృతి మంచిది కాదు.
దాడి జరిగి ఇంతసేపు అవుతున్న పోలీసులు ఎందుకు నిందితులను పట్టుకోలేదు ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు రేపు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. వెంటనే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు అనంతల ఆంజనేయులు. గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్. పోలంపల్లి వెంకటేశ్వర్లు. మాజీ సర్పంచులు దున్న సుధాకర్. కలకొండ పిచ్చయ్య. దొడ్డి నరసింహారావు. మాజీ ఎంపీటీసీలు జొన్నలగడ్డ వీర గోవిందు . మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లం శ్రీనివాస్. దున్న రవి.మేకల గంగరాజు కూరాకుల కృష్ణమూర్తి కాసాని శ్రీనివాసరావు. మండల మైనార్టీ నాయకులు ఎస్కే జలీల్. ఎస్.కె బుడే సాబ్. మండల యూత్ నాయకులు మేకల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.