అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం నరసింహపురం గ్రామంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది. నరసింహపురం గ్రామంలో గ్రామ పూజారి మరియు గ్రామ పటేల్ మాకు ప్రత్యేకమైన పండుగలో పండుగ పచ్చ పండుగ అని తెలియపరిచారు, ఈ పండుగ ప్రాముఖ్యత ముందుగా ఆ గ్రామంలో గ్రామ దేవతలను శుభ్రం చేస్తారు పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత పూజాలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవతలకు నైయ్ వైద్యాలు సమర్పిస్తారు, అప్పుడు గ్రామ పూజారి తో పాటు గ్రామస్తులు సమక్షంలో ఈ పండుగ చేయడం మొదలవుతుంది అప్పుడు పండుకి సంబంధించిన కార్యచరణాలు మొదలు పెడతారు అప్పుడు దేవతలకి మొక్కులు చెల్లిస్తారు, మేకలు కోళ్లు దేవతలకు అర్పిస్తారు అప్పుడు ఆ గ్రామంలో ప్రజానికం అందరు కూడా ఈ పండగ అయిపోయిన తర్వాత ఆకుకూరలు కానీ అనేక రకాల కూరగాయలు కానీ కొత్తవి తినడం మొదలుపెడతారు ఏజెన్సీ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి అనేక చోట్ల ఈ యొక్క పండగను ఘనంగా పూజారి పట్టణ ఆధ్వర్యంలో ఘనంగా చేపడతారు, ప్రతి ఏటా ఈ యొక్క పండగను చేయటం అనేది ఆదివాసి సమాజానికి ఎంతో ప్రాముఖ్యత అని తెలియపరుస్తున్నారు, ఈనాటి సమాజంలో ఇప్పటికి కూడా ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసులంతా ఏకతాటిపై ముందుండి నడిపిస్తూ ఉంటారు ఆనాడు పూర్వికులు చూపిన బాటలో ఇప్పటి యువతరం కూడా ఆ బాటలోనే పయనిస్తూ ఉంటారు,ఇది మన ఏజెన్సీ గ్రామాల్లో ప్రతి గ్రామంలో నిర్వహిస్తారు. ఈ పండగలు కీలకంగా వ్యవహరించే వారు గ్రామ పూజారి, గ్రామ పటేల్, గ్రామ హేపరి వీళ్ళని ఆ గ్రామంలో ముఖ్య పాత్రలుగా పోషిస్తారు, అలాగే ఇటువంటి ఆనాటి కాలం నుండి సాంప్రదాయాలు ఇప్పటి యువతరం కూడా అదే బాటలో ప్రయాణం చేయడం అనేది ఎంతో అభినందనీయమని ఆ యొక్క గ్రామ పూజలు పటేల్ తెలియపరిచారు. పచ్చ పండగ ప్రత్యేకత మా ఆదివాసి సమాజంలో ఈ పండగ అయిపోయిన తర్వాత మా గూడెంలో పండే ప్రతి కూరగాయలు బీరకాయ, ఆనపకాయ, చక్కెరకాయ ఇంకా చాలా రకాల కూరగాయలు ఈ పండగ అయిపోయింది తర్వాత మా ఆదివాసి గూడేలో తినడం మొదలు పెడతారు, మా ఆదివాసి సంప్రదాయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం అని తెలియపరిచారు, ఆదివాసి తెగలలో మాకుఈ పండక్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని తెలియపరిచారు, ఈ కార్యక్రమంలో పూజారి ముచ్చిక సింగయ్య, ప్రసాద్, బాలకృష్ణ, వెట్టి సత్యం, పద్ధం అర్జున్, వంజం రామారావు, ముచ్చిక కొండయ్య, పద్దం శ్రీను, మడకం మల్లయ్య, ముచ్చిక రాంకుమర్,మడివి వీరయ్య, వెట్టి మూకేశ్, ముచ్చిక లక్ష్మమయ్య,తదితరులు పాల్గొన్నారు.