పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 15:మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి వడ్ల శ్రీనివాస్ :మక్తల్ నియోజకవర్గ నర్వ మండలంలోని బుడ్డాగాని తాండలో కార్య క్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారికంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరుపున తప్పకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా మరోసారి అందరికీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.