పయనించే సూర్యడు // ఫిబ్రవరి // 24 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, మెదక్-నిజామాబాద్- అదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక మండలం, నర్సింగాపూర్ గ్రామంలో, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు వీణవంక మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో వీణవంక మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతరవేన సతీష్ కుమార్, గిరవెన మహేందర్, బోయిని విద్యాసాగర్, గణేష్ రెడ్డి,కిషోర్ గౌడ్, మల్లయ్య, మడ్డి అజయ్,రాజు, అజయ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.