పయనించే సూర్యుడు జూలై 3 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలో నాగుల వెల్లటూరు, నేర్నూర్ గ్రామాలలో పొలం పిలుస్తుంది. కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి. హిమ బిందు మాట్లాడుతూ ఎరువుల యాజమాన్యం కలుపు నివారణ చర్యలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా కౌలు రైతులు సాగు చేస్తున్న పంట లు కు తప్పనిసరిగా సి సి ఆర్ సి కార్డులు పొందాలని చూసించారు. సి సి ఆర్ సి కార్డుకు ఒక ఫోటో, ఆధార్ కార్డు, తీసుకొని వీఆర్వో ని సంప్రదించి కార్డులు పొందవలసిన చెప్పారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్, వేలూరు కేశవ చౌదరి నాగుల వెల్లటూరు సర్పంచ్, షేక్ మస్తాన్, వైస్ చైర్మన్ తాలూరి వెంకట కృష్ణయ్య ఏ ఈ ఓ. సుజాత, వి ఏ ఎస్. ఇమ్రాన్ ఖాన్ రైతులు తదితరులు పాల్గొన్నారు