
పయనించే సూర్యుడు డిసెంబర్ 31( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రీ–సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. సూళ్లూరుపేట మండల రెవెన్యూ అధికారి (MRO) ఆదేశాల మేరకు జనవరి 2వ తేదీ నుంచి గ్రామంలోని అన్ని భూములకు రీ సర్వే చేపడతామని అధికారులు తెలిపారు. రీ సర్వే ప్రక్రియకు గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. సర్వే పూర్తైన అనంతరం క్లియర్ అయిన భూములకు పట్టా పాస్బుక్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీరాములు, మండల సర్వేయర్ రామారావు, విలేజ్ సర్వేయర్ వినోద్, VRO అజంత, టీడీపీ గ్రామ కార్యదర్శి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
