
పయనించే సూర్యుడు డిసెంబర్ 5 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామం మరోసారి తుఫాన్ దెబ్బకు చిత్తడైంది. దిత్వ తుఫాన్‌తో కురిసిన అతివృష్టి కారణంగా గ్రామ పరిధిలో 50 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నీటమునిగి నాశనం అయింది. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో వరి రైతులు ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ ఈసారి మరింత తీవ్రంగా తెలిసింది.“ఏటా ఇదే దుస్థితి. మా వరి ఎలా పెరిగినా చివరికి ఇలా మునిగిపోతుంది. ప్రభుత్వం మా గోడు ఎప్పుడూ పట్టించుకోదు” అని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా గ్రామానికి వచ్చిన VRO కేవలం పరిశీలించి వెళ్లిపోవడం. ప్రజలను అడిగి ,ఎలాంటి నష్టపరిహారమైన నివేదిక పై అధికారులు సమర్పించలేదు ప్రజల కష్టాల్లో ఉంటే చూసి పోవడం ఎంతవరకు కరెక్ట్ మీరేమన్న చుట్టం చూపుగా వచ్చి పోవడం ఎంతవరకు కరెక్ట్ ప్రజల్ని ఆదుకోకుండా ఎల్లటం ఏంటయ్యా పంట ఎక్కడ వరకు దెబ్బతినిందో చూసి రైతులకి నష్టపరిహారం పైన ఎటువంటి చర్యలు లేకపోవడంతో రైతుల్లో ఆగ్రహం చెలరేగింది.గ్రామానికి ఆనుకొని ప్రవహించే కాలంగి నది ప్రతి తుఫాన్ సమయంలో గ్రామానికి శాపం అవుతోందని స్థానికులు చెబుతున్నారు. నది కి ఎక్కడా పోల్లు కట్ట అడ్డుకట్ట లేదు. దీని వలన చిన్న తుఫాన్ వచ్చినా పంట అంతా నీళ్లలో కలిసిపోతుంది” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయి, వరి పూర్తిగా పడిపోయిన దృశ్యం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.ఇక గ్రామ పరిసరాల్లో అనధికార ఇసుక రవాణా కారణంగా నీటి పారుదల మార్గాలు మూసుకుపోయి, చిన్న వర్షానికి కూడా నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. “మా గ్రామం సమస్యలపై ప్రభుత్వం స్పందించే రోజు ఎప్పుడు వస్తుందో?” అని రైతులు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తమ గోడును వినిపించారు.
