
పయనించే సూర్యుడు జనవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి చెంగాలమ్మ గుడి సమీపంలో అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పొలాలకు వెళ్లిన గ్రామస్థులు ఘటనను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.