పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు మరియు ఆత్మా DPD B. సరిత నానో యూరియా,నానో డి ఏ పి పై రైతులకు అవగాహన కల్పించడం జరిగినది నానో యూరియా ఎకరానికి 500ml వాడడం ద్వారా ఒక బస్తా యూరియా వాడకం తగ్గించుకోవచ్చని రైతులకు తెలియజేశారు, రైతులు డ్రోన్స్ ద్వారా యూరియా పిచికారి చేయాలని సులభమైన పద్ధతులు అలవాటు చేసుకోవాలని తెలియజేశారు అలాగే ప్రైవేట్ షాప్ లో యూరియా వ్యవసాయ అధికారి సమక్షంలో 266.50 అమ్మడం జరిగినది ఈ కార్యక్రమంలో ఏ. డి.ఏ. జి.లాల్ చాంద్ ఎం. ఏ.ఓ. అన్నపూర్ణ ఏ ఈ ఓ శ్రావణి పాల్గొన్నారు