//పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా మక్తల్ నియోజవర్గంశ్రీనివాస్ మార్చ్3 తేదీ నారాయణ పేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా వారి నాన్న మీదిగేరి కన్కప్ప వర్ధంతి సందర్భంగా అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి నాన్న బాల్యంలో ఉన్నప్పుడు సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి అని చెప్పేవారు కావున శక్తి కొలది దేశ నాయకుల,కుటుంబ సభ్యుల జయంతి,వర్ధంతి సందర్భంగా ఈ సేవ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.వారి గ్రామంలో ప్రతి సంవత్సరం పదవ తరగతి లో మొదటి,రెండవ ర్యాంక్ సాధించిన వారికి మొదటి నగదు బహుమతి 1500,రెండవ నగదు బహుమతి 1000 రూపాయలు అందజేస్తామని తెలిపారు.అదే విధంగా అంగన్వాడీ పిల్లలకు పలకలు,విద్యార్థులకు నోటు పుస్తకాలు,పరీక్ష ప్యాడ్లు మరియు ఆసుపత్రిలో రోగులకు పండ్లు మొదలగు సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ తమతమ శక్తి కొలది సేవ కార్యక్రమాలు చేసి సమాజంలోని బీద వారికి అండగా నిలవాలని కోరారు.