//పయనించే సూర్యుడు// జులై 4//మక్తల్
ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో మక్తల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కలాల్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి అదే విధంగా గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం గురించి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఆదేశాల మేరకు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో మక్తల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా పార్టీని విజయతీరాలకు చేర్చాలని ఒక యుద్ధ ప్రతిపాదికన కష్టపడిన కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా పార్టీ అండగా ఉంటుంది అనే ధైర్యం ఇచ్చుకుంటూ కష్టపడుతున్నటువంటి యువతి యువకులు మహిళలు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి,అది జనసేన పార్టీ ఒక్కటే కాదు మీకు సిద్ధాంతాలు నచ్చిన ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ వేదికను అయినా ఎన్నుకుని అందు లో చేరి రాష్ట్ర మరియు దేశ నిర్మాణం లో పాలుపంచుకోవాలి అవినీతి లేని రాజకీయాలు జీరో బడ్జెట్ రాజకీయాలు సమాజానికి ఉపయోగ పడే రాజకీయాలు విద్యా వైద్యం సామాన్యుడికి కూడా అందేలా పారదర్శకత గల రాజకీయం మరియు జవాబుదారీతనం గల రాజకీయాలు చేయాలని ఆయన అన్నాడు మరియు సామాన్యూడు కూడా ఒక నాయకుడుగా ఎదిగి సమాజం కోసం పాటు పడే పార్టీ మా జనసేన పార్టీ యువత మంచిగా ఎదగడానికి జనసేన పార్టీ ఒక మంచి రాజకీయ వేదిక అని ఆయన పిలిపునిచ్చారు మంచి ఆలోచనలు సామాజిక స్పృహ దేశం కోసం సేవ చేయాలనే ఆలోచన మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆయన ఆలోచనలు నచ్చే ఏ వ్యక్తి అయిన జనసేన పార్టీ లో కి చేరి స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి ఇది చక్కటి అవకాశం అని ఆయన పిలుపునిచ్చారు ఇట్టి సమావేశానికి హాజరు అయిన ప్రతి జనసేన కార్యకర్తకి ముఖ్యమైన నాయకులకు డాక్టర్ మణికంఠ గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు *ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు గౌడి బాల్ రెడ్డి కలల్ రామన్ గౌడ్ టేకులపల్లి భీమేష్ అంజప్ప కుమ్మరి పరుశరామ్ యాదగిరి వెంకట్ రెడ్డి మరియు జనసైనికులు పాల్గొన్నారు