పయనించే సూర్యుడు// న్యూస్ మే 6//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు ,సిద్ధాంతాలు నచ్చి, తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నెమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలం ఎడివెల్లి గ్రామం లోని యువకులు మక్తల్ నియోజకవర్గం స్థానిక జనసేన పార్టీ కార్యాలయం లో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ నేతృత్వంలో ఎడివెల్లి గ్రామానికి చెందిన శివకుమార్ చొరవతో 10 మంది కి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ సీనియర్ నాయకులు శ్యామ్ మాట్లాడుతూ ఎడివెల్లి గ్రామం నుంచి యువకులు జనసేన పార్టీ కి మద్దతుగా పార్టీ లో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని,జనసేన పార్టీ స్థానిక ప్రజల యొక్క వివిధ సమస్యలపైన పోరాటాలు చేస్తూ పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కారం చూపే విధంగా ప్రజలకి మీ ద్వారా నమ్మకం ,భరోసా ఇవ్వాలని తెలిపారు మరియు రానున్న స్థానిక ఎన్నికలలో జనసేన పార్టీ మన మక్తల్ నియోజక వర్గం లో కూడా సత్తా చాటుతుంది అని తెలిపారు కొత్తగా చేరిన వారిలో .మహాదేవ్, రమేష్, పవన్ కుమార్, గోవింద్, శివ,పరుశరామ్,భాస్కర్, , వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్, హన్మంతు,రామన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.