
పయనించే సూర్యుడు డిసెంబర్ 9 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు నారాయణ హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఎంతో తపన పడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గొప్ప వైద్యం అందిస్తూ ప్రజల ని ఆరోగ్యంగా కాపాడుకోవాలని నారాయణ హాస్పిటల్ వారిచేతిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారుపొల్లూర్ గ్రామంలో మంగళవారం నాడు నెల్లూరు నారాయణ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు అందజేశారు.కీళ్ళు, ఎముకల వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలపై నిపుణులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కంటి శుక్లాల (కాటరాక్ట్) ఆపరేషన్ల కోసం ఎంపికైన రోగులకు రేపు సూళ్లూరుపేట నుంచి నెల్లూరు నారాయణ హాస్పిటల్ వరకు ఉచిత బస్సు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పామూరు మునస్వామి, మోదుగుల కృష్ణయ్య మాటలాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం చేపడుతున్న సేవలు అభినందనీయమని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి పునాది అని ఆయన పేర్కొన్నారు.ఈ శిబిరంలో పామూరు మునస్వామి, మోదుగుల కృష్ణయ్య, తాడి మునిశేఖర్, బండ్ల యుగంధర్, చెంచు రామయ్య, కుప్పంపాటి నాగరాజు, ఆవుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
