పయనించే సూర్యుడు సింగనమల రిపోర్టర్ గణేష్ 12 సింగనమాల నియోజకవర్గం లోని నార్పల బీసీ సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణి శ్రీ మంగళవారం రాత్రి వంట గదిలోను స్టోర్ రూములను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి సమస్య అయినా తన దృష్టికి తీసుకురావాలని బీసీ సంక్షేమ అధికారి వార్డెన్ ని ఆదేశించారు అదేవిధంగా పిల్లలకు ఎటువంటి లోపం ఇబ్బందులు లేకుండా నాణ్యతమైన భోజన సదుపాయం కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు