పయనించే సూర్యుడు (న్యూస్) మక్తల్ జనవరి 18.నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు మండలాల మధ్య ఉన్న ఓ గ్రామానికి మాజీ సర్పంచ్ తనయుడు డాన్ లా వ్యవహరిస్తున్నాడు. తనకంటూ ఓ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇసుక విషయంలో ఏ ఒక్కరిని కూడా అడుగుపెట్టనివ్వడం లేదు. తనకు తెలియకుండా ఏ వ్యక్తి అయినా పొరపాటున తన గ్రామం నుండి ఇసుక తీసుకెళ్తే తన సైన్యాన్ని పంపించి గొడవకు దిగడం చాలా మామూలు విషయం అయిపోయింది. ఈ విషయమై గ్రామస్తులు అటు మింగలేక, కక్కలేక నానా తంటాలు పడుతున్నారు. ఇతను ఇంతకుముందు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం లోను, ఇప్పటి ప్రభుత్వంలోనూ తన హవా కొనసాగిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.