ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు సదానందం..
పయనించే సూర్యడు //24//జనవరి //హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రేషన్ కార్డులు మరియు రేషన్ బియ్యం విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా బీపీ, షుగర్ వంటి మహామ్మరీలతో మరణిస్తున్న రన్నారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మండల అధ్యక్షులు సదానందం మాట్లాడుతూ... ప్రతి రేషన్ కుటుంబానికి నాణ్యమైన ఆరు కిలోల పాలిష్ చేయని బియ్యం దంపుడు బ్రౌన్ రైస్ ను రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలన్నారు.అలాగే రాష్ట్రంలో చాలా మంది మహిళలు,పిల్లలు, పౌరులు పౌష్టికాహారంతో చనిపోతున్నరన్నారు. ప్రతి రేషన్ కుటుంబానికి ముడి బియ్యంతో పాటు 5 కిలోల కందిపప్పు తో పాటు, ప్రతినెల రాగిజావ ప్యాకెట్ పది కోడి గుడ్లు ఇవ్వాలని తెలిపారు .. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నియోజకవర్గానికి 3500 ఇండ్లు కాకుండా అర్హత కలిగి ఉండి ఇల్లు కట్టుకునే ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకునే లబ్ధిదారులందరికి ఇందిరమ్మ పథకాన్ని అమలు చేసే విధంగా సమాలోచన చేయాలని,రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ సభలో సూచించారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న 12000 కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేస్తూ, రోడ్లపై రైతులు వడ్లు పోయకుండా ప్రభుత్వం జీవో చేయాలని తెలిపారు. అలాగే రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉండేలా చూడాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హులందరికీ 12,000 ఇవ్వాలని తెలియజేసారు , గ్రామ సమస్యల విషయములో గ్రామంలో అధునాతన గ్రంధాల ఏర్పాటు, మరియు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లతో అధునాతన ప్రభుత్వ హాస్పటల్ ను మా నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధు రాని బాధితులకు దళిత బంధు ఇవ్వాలని కోరారు. మరియు చదువుకున్న నిరుద్యోగ విద్యార్థులందరికీ ప్రతి మండల కేంద్రంలో స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టి ఉపాధిని కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని,వీణవంక మండల తాసిల్దార్ శ్రీనివాస్ కి వినతి పత్రంను అందజేశారు. కేవలం ఎలక్షన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేరుతో గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి మేలు జరగకపోతే రానున్న స్థానిక ఎలక్షన్లలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మసమ్మ పార్టీ మండల అధ్యక్షులు సదానందం, నర్సింగాపూర్ గ్రామ డి.ఎస్.పి కమిటీ సభ్యులు రాజు, పృధ్వీరాజ్, చందు,రవి కిరణ్,రాకేష్,పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు..