పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఆర్టీసీ బస్సులో ప్రయాణి కుడు పోగొట్టుకున్న రూ.పద ముడు లక్షల విలువైన బ్యాగును తిరిగి అప్పగించి కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు. ఈ నెల ఇరవై ఆరు న హైదరాబాద్ అచ్చం పేట రూట్ చెందిన ఆర్టీసీ బస్సులో కందుకూర్ లో బస్సు ఎక్కిన ప్రయాణి కుడు రూ.పదముడు లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటూ కొంత నగదు ఉన్న బ్యాగును సీబీఎస్ లో మరిచి దిగిపోయాడు. బ్యాగు అచ్చంపేట డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లుకు దొరకడంతో ఈ విషయాన్ని అచ్చంపేట డీఎం మురళీ దుర్గా ప్రసాద్ కు ఫోన్ లో సమాచారం అందించారు. ఈమేరకు బ్యాగ్ ను ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ ఆఫీస్లో అప్పగించాలని డీఎం సూచించారు. ఇంతలోనే అనిల్ కుమార్ అనే ప్రయాణికుడు డీఎంకి ఫోన్ చేసి బస్సులో బ్యాగు ను మరచిపోయినట్లు చెప్పారు. టీజీఎస్ఆర్టీసీ అధికారులు వివరాలను పరిశీలించి.బ్యాగును ప్రయాణికుడు అనిల్ కుమార్ కు అందజేశారు. కండక్టర్ వెంకటేశ్వర్లు ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇవాళ బస్ భవన్ లో సన్మానించి అభినందించారు.