పయనించే సూర్యుడు మే 13 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
అకాలవర్షాలవలన నష్టపోయిన ఉద్యాన రైతులనుఆధుకోండి నిమ్మ తోటలను పరిశీలించిన రైతు సంఘం సిపిఐ నాయకులు యాడికి మండల కేంద్రంలోని చందన రోడ్డులో మంగళవారం రాత్రి గాలి వానకు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న నిమ్మ తోట రైతు గొడ్డుమర్రి బయన్న, రమేష్ పొలాన్ని ఏపీ రైతుసంఘము సిపిఐ అద్వర్యములో పరిశీలించారు.జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు వి వెంకటరాముడు యాదవ్, యాడికి సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, యాడికి మండల కేంద్రానికి చెందిన రైతు లు బయన్న, రమేష్ తమకున్న మూడు ఎకరాల భూమిలో నిమ్మ చెట్లను నాటారు. మంగళవారం రాత్రి వీచిన గాలివానకు అకాల వర్షానికి సుమారు 35 చెట్లు నేలకొరిగాయి. సుమారు రైతుకు రెండు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. పంట చేతికొచ్చే సమయంలో చెట్లు నేలకొరవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు బయన్న, రమేష్ ప్రభుత్వం తమను ఆదు పోవాలని కోరారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో దైవాలమడుగు,, చందన గ్రామాల మధ్యలో ఆరు టిఎంసిల సాగు నీరు తాగునీరు ప్రాజెక్టు ఏర్పాటుకు అంచనా వేశారున్నారు. కానీ అ ప్రాజెక్టు ఏర్పాటు అయితే యాడికి మండలంలో సాగునీరు సమస్య లేకుండా ఉంటుందని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావాలని మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ కోరారు. ఈ అకాల వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతులను జాతీయ విపత్తుగా భావించి రైతులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డెరాముడు పట్టణ కార్యదర్శి చిన్న కుల్లాయి రెడ్డి పట్టణ సహాయ కార్యదర్శి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.