పయనించే సూర్యడు // మార్చ్ // 4 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో, మండలాల్లో హుజురాబాద్, జమ్మికుంట, మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఎలాంటి తాగునీటి కొలతలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ఆ విభాగానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ కోరారు. గ్రామాల్లో బోర్లు చెడిపోయిన, మైనార్ రిపేర్లు ఉన్నట్లయితే అలాంటి వాటిని గుర్తించి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసారి (వేసవి )కాలం తీవ్రంగా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపిన విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పాటించాలని తెలిపారు. ప్రజలకి తాగునీటి కొరత లేకుండా చూడాలి అని కోరారు.నియోజకవర్గ ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోండి