పయనించే సూర్యుడు ఆగస్టు 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
వినాయకచవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్దలతో జరుకోవాలని, ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయకచవితి తెలుగువారి తొలి పండుగ అని, ముఖ్యంగా రైతులు, విద్యార్థులకు ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ అని పేర్కొన్నారు. తెలుగు వారు ఏ పని చేయాలన్నా ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసేందుకు తొలుత గణపతికి పూజలు చేస్తారని అన్నారు.వినాయకచవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్దలతో శుభప్రదంగా నిర్వహించుకోవాలని కోరారు. ఆ విఘ్నేశ్వరుడిని ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.