
పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలో ఉద్రక్తత వాతావరణ చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద వీహెచ్పీ నేతలు నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. హైకమిషన్ ఎదుట బారిగేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయాత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వీహెచ్పీ కార్యకర్తలను నిలిపివేస్తున్నారు.