టిపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి, సంగ శ్రీనివాస్
పయనించే సూర్యుడు, ప్రతినిధి (శ్రీరామ్ నవీన్), తొర్రూరు డివిజన్ కేంద్రం... మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, ఆలేరు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, శ్రీరామ్ ప్రవీణ్, ఆధ్వర్యంలో , నిర్వహించిన విలేకరుల సమావేశంలో, మహబూబాబాద్ జిల్లా, "తెలంగాణ ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్" "(టిఫి టి ఎఫ్,) జిల్లా కార్యదర్శి, సంగ శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క, పదవీ విరమణ వయసును, పెంచాలని చూడడం, నిరుద్యోగులకు అన్యాయం చేసినట్లే అవుతుందని, అన్నారు, గత 20 సంవత్సరాల (2004,) నుండి, పదవి విరమణ పొందిన వారికి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అందించలేకపోతున్న, ప్రభుత్వాలు, అని అన్నారు, గత ప్రభుత్వాల మాదిరి వలె, ప్రస్తుతా అధికారంలో ఉన్న పార్టీ కూడా, ఇలా చేయడం, నిరుద్యోగులకు అన్యాయం చేసినట్లు అవుతుందని, అన్నారు, కొత్త వారికే అవకాశం ఇస్తూ, రిటైర్మెంట్ కావాల్సిన వారికి, వారి సేవలను గుర్తించి, రిటైర్మెంట్కు సంబంధించిన, అన్ని రకాల బెనిఫిట్స్ కల్పించాలని, కోరుతున్నామన్నారు, అంతేకాదు ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని, కోరారు, ఈ కార్యక్రమంలో, మహబూబాబాద్ జిల్లా, టిఎటిఎఫ్ జిల్లా కార్యదర్శి, సంగ శ్రీనివాస్, శ్రీరామ్ ప్రవీణ్, బిక్షపతి, రవి, తో, పాటు పలువురు ఉపాధ్యాయులు, పాల్గొన్నారు..