
బీఆర్ఎస్వీ అధ్యక్షులు శీలం శ్రీకాంత్
( పయనించే సూర్యుడు జూన్ 19 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులపై ప్రభుత్వం నిర్బంధాలు, అక్రమ అరెస్టులకు పాల్పడడం తీవ్రంగా ఖండించదగిన విషయం. నిరుద్యోగులకు మద్దతుగా "5000 కాదు – 20000 ఉద్యోగాలు భర్తీ చేయాలి" అంటూ చేపట్టిన నిరసన కార్యక్రమం నేపథ్యంలో షాద్నగర్ బీఆర్ఎస్వీ అధ్యక్షులు శీలం శ్రీకాంత్, నియోజకవర్గ యువజన నాయకులు గుండు అశోక్, బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి తమగొండ రాజశేఖర్లను ఈ రోజు ఉదయం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ తాలూకా అధ్యక్షులు శీలం శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం స్పందించాలని కోరారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు… నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.