
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నిరుద్యోగ మిలియన్ మార్చ్ లో భాగంగా మిలియన్ మార్చ్ ధర్నాకు వెళ్లనియకుండా ముందస్తు అరెస్టు చేస్తున్నమని .రాత్రి 4 గంటలకు భైంసాలో గల శంకర్ నివాసంలో నిరుద్యోగ జేఏసీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు శంకర్‌ను.పోలీస్ అరెస్టుచేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. కొత్తూరు శంకర్ మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం ఈ మిలియన్ మార్చ్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కలిసి పోరాడుతున్నారని ఈ పోరాటాన్ని మీరు అంచివెయ్యాలని చూస్తే మరో తెలంగాణ మిలియన్ మార్చ్ ల మారి ప్రభుత్వం కూలిపోయే రోజు వస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాక ముందు నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారని. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని దాని పక్కదారి మళ్లించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు యమపాశంల మారుతున్నాయని కొత్తూరు శంకర్ మాట్లాడుతూ మండిపడ్డారు. ఈ అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల గురించి మాట్లాడి వెంబడే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని తెలపడం జరిగింది.లేనిపక్షంలో ధర్నాలు రాస్తారోకోలు చేసి మరో తెలంగాణ ఉద్యమంలా నియమకల కోసం పోరాడుతమని తెలుపడం జరిగింది.
