ప్రజాస్వామ్యంలో నిర్బంధం హేతుబద్ధం కాదు.
గిరిజన యువనేత ఆకాష్ నాయక్
( పయనించే సూర్యుడు జూలై 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని, వారికి మంత్రి పదవిని కల్పించాలని డిమాండ్ చేస్తూ… గిరిజన సంఘాలు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కుల గణనలో లంబాడీల జనాభా వివరాలను బహిర్గతం చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.ఈ ఉద్యమానికి ముందస్తు చర్యగా, గిరిజన యువ నేత ఆకాష్ నాయకుడిని జిల్లేడు చౌదరి గూడెం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆకాష్ నాయక్ మాట్లాడుతూ…ప్రజాస్వామ్యంలో నిరసనలు, ఉద్యమాలు హక్కుగా ఉంటే… ముందస్తు అరెస్టులు ఎలా న్యాయసమ్మతమవుతాయి? ఇది ప్రజాస్వామ్యంపై నెరపుదెబ్బ. ప్రభుత్వానికి ప్రజల డిమాండ్ల పట్ల గౌరవం ఉండాలి. లంబాడీలకు రాజకీయంగా న్యాయం జరగాలి. సామాజిక న్యాయం మాటల్లో కాదు.కుర్చీల రూపంలో కనిపించాలంటూ హితవు పలికారు.అంతేకాకుండా, రాష్ట్రంలో వంచిత వర్గాలకు గళం ఇచ్చే గిరిజన ఉద్యమాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. గాంధీభవన్ ముట్టడి శాంతియుతంగా జరుగుతుందని, ప్రభుత్వ మద్దతు లేకున్నా గిరిజనుల హక్కుల సాధన కోసం ప్రజా పోరాటం చేస్తామని పేర్కొన్నారు.