
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా చలనచిత్ర టీవీ అసోసియేషన్ కు చెందిన కళాకారులు మున్సిపల్ వైస్ చైర్మన్అప్పాల గణేష్ చక్రవర్తి ని గౌరవపూర్వకంగా కలిసి పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కళాకారులు తమ సమస్యలను మున్సిపల్ వైస్ చైర్మన్ గారి దృష్టికి తీసుకువచ్చారు. నిర్మల్ జిల్లా కళాకారులకు ప్రభుత్వం ద్వారా పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సంక్షేమ పథకాలు అందేలా సహకరించాలని కోరారు. అలాగే కళాకారుల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా కళాకారుల భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులు కోటగిరి నరసయ్య చారి, ప్రధాన కార్యదర్శి తిరుక్కోవెల రవి, ఉపాధ్యక్షులు కమలాకర్, కోశాధికారి సామెర్ల రాజన్న, పడాల మోహన్ రావు, బొందిడి పురుషోత్తం, కృష్ణ వర్మ, నరేందర్, జన్ను అనిల్ తదితర కళాకారులు పాల్గొన్నారు.