
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
భైంసా: ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన మరాఠా సమాజానికి చెందిన సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లను ఆరె మరాఠా ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (AMEWA) ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు గ్రామాల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన విద్య అందించడంతో పాటు త్రాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, వీధిదీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో AMEWA అధ్యక్షుడు శ్రీ లింగురామ్ ప్రదీప్ పాటిల్ , ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కర్ బాబూరావ్ పాటిల్ , మరాఠా సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ జే.కే. పాటిల్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం కార్యదర్శి శ్రీ భోస్లే పండిత్ రావ్ పాటిల్ లతో పాటు జిల్లా లోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.