ప్రధాన రహదారులు కూడల్ల లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నళ్ళు
పయనించే సూర్యుడు: తేదీ జనవరి 22 బుధవారం... గాజులరామారం రిపోర్టర్: ఆడెపు సంతోష్ కుమార్ ( మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా) జంట సర్కిల్లోని ప్రధాన రహదారులు కూడల్ల లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్ళు అలంకారప్రాయంగా మారాయి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేశారు కానీ నిర్వహణను గాలికి వదిలేయడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ట్రాఫిక్ చిక్కులు లేని రోడ్లు కూడాల్లే లక్ష్యంగా ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా *ఐడిపిఎల్ కూడలి నుంచి సూరారం కట్ట మైసమ్మ వరకు, షాపూర్ నగర్ రంగా థియేటర్ నుంచి డిమెట్ల జాతీయ రహదారి వరకు, షాపూర్ నగర్ ఉషోదయ కూడలి నుంచి కెపిహెచ్బి కాలనీ, ఐడిపిఎల్ నుంచి జగద్గిరిగుట్ట వరకు కుత్బుల్లాపూర్ నుంచి జీడిమెట్ల సుచిత్ర వరకు 23 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులను సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం (సి ఆర్ ఎం పి) కింద ఐదేళ్ల క్రితం ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చిన నిర్వహణ కాంట్రాక్టు గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో పూర్తయింది. వాహనాల రద్దీకి అనుగుణంగా ఆయా రహదారులను విస్తరించారు ప్రధాన కూడల్లను అభివృద్ధి చేసి ట్రాఫిక్ సిగ్నళ్ళు ఏర్పాటు చేయించారు కానీ పలుచోట్ల సిగ్నళ్ళు పనిచేయక ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. *జీడిమెట్ల డిపో టోపాజ్ కంపెనీ వద్ద ఏర్పాటుచేసిన సిగ్నళ్ళు పనిచేయడం లేదు *అపురూప కాలనీ *ఎస్ ఆర్ నాయక్ నగర్ హెచ్ ఏ ఎల్ కాలనీ *గాజుల రామారామారం వెళ్లే వాహనాలతో ఈ కూడలి ఎప్పుడు రద్దీగా ఉంటుంది దీంతో వాహనాలు మలుపు తిరిగి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. * సూరారం మల్లారెడ్డి ఆసుపత్రి వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది సూరారం కాలనీకి వెళ్లే వాహనాలను ఇక్కడే మలుపు తిప్పుతుంటారు సిగ్నల్ పనిచేయకపోవడంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుందని ముఖ్యంగా ఆసుపత్రికి వెళ్లేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు..! అధికారులు పట్టించుకోవడం లేదు. షాపూర్ నగర్ సాగర్ హోటల్ ఎదురుగా రంగా థియేటర్ సూరారం జ్యోతి మిల్క్ కంపెనీ కూడల్లలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను అధికారులు విస్మరిస్తున్నారు.. దీంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుండడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.