
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 2 ఊట్కూరు }
బిజ్వార్ గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ మెంబర్ గుడిసె చిన్న రాజు గత పది సంవత్సరాల నుండి త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న వార్డ్ ప్రజలకు గ్రామ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి తో మాట్లాడి పైపు లైన్ కు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డ్ ప్రజలు త్రాగునీటి సమస్య తీరడంతో హర్షం వ్యక్తం చూస్తూ ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య మాట్లాడుతూ గ్రామంలో రోడ్లులు,డ్రైనేజీలు, పారిశుద్యం తో పాటు ప్రజలకు త్రాగునీరు సమస్య తీర్చడనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఐదు సంవత్సరాలలో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులుగుడిసె చిన్న రాజు,నేడుగం రాఘవేంద్ర, చెన్నా రెడ్డి,వెంకటేష్ గౌడ్,నాయకులు పత్తి ఆంజనేయులు, అశోక్, నరేష్, గుంతలి నర్సింహా, తిరుపతి, కె. బి. నరేష్, సప్పటి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
