
పయనించే సూర్యుడు జూలై 22 (ముమ్మిడివరం ప్రతినిధి) (*బీజేపీ గుంటూరు జిల్లా ఇన్చార్జ్ యాళ్ల దొరబాబుగుంటూరు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనను బీజేపీ గుంటూరు జిల్లా ఇంచార్జ్ యాళ్ల దొరబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నీట్ పరీక్షలో అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, పరీక్షను రద్దు చేయడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియ చేపట్టిందని తెలిపారు.. అంతేకాదు పరీక్షలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరి స్తోందని పేర్కొన్నారు.ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వాస్తవాలను గుర్తించాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు . దేశ భవిష్యత్తు అయిన యువత భావోద్వేగాలకు లోనై కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర ప్రతిపక్షాలు ప్రేరేపించే రాజకీయ ఉద్యమాల్లో పాల్గొని తమ ఉజ్వల భవిష్యత్తును ప్రమాదంలో పడేయవద్దని సూచించారు. యువత తమ విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపైనే దృష్టి సారించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యాళ్ల దొరబాబు పిలుపునిచ్చారు.