
( పయనించే సూర్యుడు ఆగస్టు 31 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)కొందుర్గు మండలానికి నూతనంగా విచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిఎస్ఎస్ వరప్రసాద్ గారిని బీజేపీ కొందుర్గు మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఎస్ఐ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొందుర్గు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో ఆయన విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, సీనియర్ నాయకులు మంగనగారి బలవంత్ రెడ్డి, పర్వతాపూర్ సర్పంచ్ బోయ అశోక్, నాయకులు గుండేటి శివారెడ్డి, లక్ష్మయ్య గౌడ్, కార్తిక్ యాదవ్, చందు ముదిరాజ్, గోపి నర్సింలు, రఘునాథ్ రెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు