పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది.ఈనేపథ్యంలోనే రేషన్ సరఫరాలో అవినీతి అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సుండుపల్లె మండలం తిమ్మసముద్రం,పెద్ద బలిజపల్లి గ్రామాల నుందు పర్యటిస్తూ ప్రభుత్వ అధికారులతో కలిసి నూతన రైస్ కార్డులను నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.రేషన్ వ్యవస్థలో అవినీతి,అక్రమాలను నియంత్రించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రేషన్ వ్యవస్థను సంస్కరించడంపై దృష్టి పెట్టిందన్నారు.పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా పలు చర్యలు తీసుకుంటుందని,చౌక ధరల దుకాణాల్లోని సరుకులు తీసుకునే విధానాన్ని తిరిగి ప్రారంభించిందని,కొత్త రేషన్ కార్డులతో పాటు క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రైస్ కార్డులను కూడా ప్రవేశపెట్టిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ,డిప్యూటీ తాసిల్దార్ ,ఎంపీడీవో , మండల పార్టీ అధ్యక్షులు,కూటమి నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.