పయనించే సూర్యడు జనవరి 18 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
ఈరోజు నడిగూడెం మండల కేంద్రంలోని నూతనముగా ఎన్నిక కాబడిన కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది. కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు మొదటిసారిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించటం అభినందించదగ్గ విషయమని, నడిగూడెం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరుపతమ్మ సుధీర్లకు చైర్మన్ అవకాశం రావడం సంతోషించదగ్గ విషయమని వారి నియామకానికి సహకరించిన గౌరవ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, స్థానిక శాసన సభ్యురాలు గౌరవనీయులు ఉత్తమ్ పద్మావతి కి అభినందనలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో, దైవస్వరూపి చర్చి సేవకురాలు కలపాల లావణ్య, గుండెపంగు రవి, సమత తదితరులు పాల్గొన్నారు