
పయనించే సూర్యుడు అక్టోబర్ 9,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా,శిరివెళ్ళ మండల కేంద్రంలో డేగలపేట ఒకటో వార్డులో ఐదవ నెంబర్ రేషన్ షాపు డీలర్ షేక్ జాని బాబు, సచివాలయం కార్యదర్శి ఉద్యోగి(మహిళా పోలీస్) ఎస్ షాహీన్ బి తో కలిసి జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెసరాయి చాంద్ బాషా ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పెసరాయి చాంద్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నామని తెలిపారు. మెగా డీఎస్సీ, “దీపం” పథకం, “తల్లికి వందనం”, “స్త్రీ శక్తి”, “అన్నదాత సుఖీభవ” వంటి పథకాల ద్వారా మహిళలు, రైతులు, పేద కుటుంబాలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులలో సీఎం లాంటి నాయకుల ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో కార్డులు పంపిణీ చేయడం హర్షణీయం అని అన్నారు.ఇప్పుడు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా మరింత పారదర్శకతతో, వేగవంతంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారుల దాకా చేరుతాయని పేర్కొన్నారు. “ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, అభివృద్ధి – సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.