రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి .విలువైన ప్రాణాలను కాపాడండి.
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 22:-రిపోర్టర్( కే శివకృష్ణ) చిత్తూరు పార్లమెంటులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో ఆవేధన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పై చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ శుక్రవారం ఢిల్లీలో స్పందించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయన్నాని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలు,మాసోత్సవాలను నిర్వహించి.., యువతకు అవగాహన కల్పించిందని గుర్తుచేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు.., ఐనా ఈ వరుస యాక్సిడెంట్స్ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మానవ తప్పిదాల వల్లే చోటు చేసుకుంటున్న ఈ రోడ్డు ప్రమాదాల వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనీ,ఈ క్రమంలో వీటినివారణకు సంబంధిత అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలు, మాసోత్సవాల కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్న తాను…, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను యువతీయువకులు వివరించినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో అధికారులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేసినట్లు వివరించారు. మరీ ముఖ్యంగా యువత తమ కుటుంబాన్ని గుర్తుపెట్టుకుని వాహనాలను నడిపి.., సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు.