.పయనించే సూర్యుడు మార్చ్ 16 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ 68వ వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు రాత్రి 9:30 గంటలకు జరిగే రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాల స్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) సతీసమేతంగా పాల్గొని స్వామివార్లకి పట్టువస్త్రాలు మరియు తలంబ్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు పాల్గొంటారు కావున తెలుగుదేశం కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావలసిందిగా కోరుచున్నాము.