( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్ )
ప్రజలను చైతన్యం చేయడంతో పాటు యువతలో దేశభక్తిని పెంపొందించి, పోరాటపటమను నింపిన మహనీయులు శ్రీ స్వామి వివేకానంద అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆదివారం షాద్ నగర్ పట్టణం రైతు కాలనీలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంస అనుచరుడిగా ఆధ్యాత్మికతను ప్రాచుర్యంలోకి తెచ్చారని,హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. 1893లో అమెరికాలోని వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్ సమావేశంలో, "సోదరులారా మరియు సోదరీమణులారా" అంటూ ప్రారంభించిన ఆయన ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుందని, హిందూ ధర్మం, సర్వమత సమానత్వం, సాంస్కృతిక గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో ఆయన పోషించిన పాత్ర వెలకట్ట లేనిదని అన్నారు.1897లో రామకృష్ణ మిషన్ మరియు రామకృష్ణ మఠం స్థాపించి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవను ప్రోత్సహించారని,విద్య, వైద్య సేవలు, పేదల సహాయం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు .భారతీయ యువతలో దేశభక్తి, ఆత్మవిశ్వాసం, సేవాభావాన్ని కలిగించి,కులవ్యవస్థ వ్యతిరేకంగా, సమానత్వం కోసం పనిచేచేసిన మహనీయులని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శమూర్తి అని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ చింటు ప్రతాప్ రెడ్డి, మానస యాదగిరి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి,యువసత్తా లక్ష్మణ్, మామిడిపల్లి మాజీ ఎంపిటిసి మాధవి రవిందర్, బిఆర్ఎస్ నాయకులు శుక్ల వర్ధన్ రెడ్డి, శివచారి,ప్రదీప్, మల్లేష్ గౌడ్, విజయరాములు గౌడ్, రాకేష్, బాలయ్య,కార్తీక్ గౌడ్, సుధీర్, మధు మరియు యువకులు పాల్గొన్నారు.