నూతన డయాలసిస్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే వాకిటి….
పయనించే సూర్యుడు// న్యూస్ మే 14//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను సందర్శించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కోటి 40 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ లో నేటి నుండి పూర్తిస్థాయిలో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో అన్ని వసతులతో కూడిన నూతన డయాలసిస్ సెంటర్ లో డయాలసిస్ బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందే విధంగా బాధితులకు చికిత్స అందుబాటులో రావడం జరిగింది అన్నారు అడిగిన వెంటనే మక్తల్ నియోజకవర్గానికి మరియు ఆత్మకూరుకు నూతన డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు అయ్యేలా సహాయ సహకారాలు అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి ,రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కి మక్తల్ నియోజకవర్గ ప్రజల తరుపును కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు