
//పయనించే సూర్యుడు// //ఫిబ్రవరి27మక్తల్ //
ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గం లో జనసేన పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యం లో నారాయణపేట జిల్లా వివిధ నియోజక వర్గ మండలాల్లో జనసేనపార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్. ఆదేశాలమేరకు మరియు మహబూబ్ నగర్ పార్లమెంటరీ ఇంచార్జ్ ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు క్రియాశీల సభ్యత్వాలు నేటి నుండి దేశ వ్యాప్తంగా ప్రారంభమైన శుభ సందర్భంగా స్థానిక శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం లో పూజ కార్యక్రమం నిర్వహించి ఘనంగా ఉద్యమి క్రియాశీల సభ్యత్వాలు మొదలు పెట్టడడం జరిగింది
ఈ సందర్భం లో రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ
ఉద్యమి కార్యక్రమం ఒక మహోన్నతమైన కార్యక్రమం దేశం లో ఎక్కడ లేని విధంగా పార్టీ కోసం పని చేసే జనసైనికులకు అనుకోకుండా ఆపద జరిగిన మృతి చెందిన సమయం లో వాళ్ల కుటుంబ సభ్యులకు ఎంతో కొంత ఆసరాగా ఉండాలని మేలు జరగాలని ఈ ఉద్యమి సభ్యత్వాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
ప్రతి జనసైనికుడు 400 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇన్స్యూరెన్స్ ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది మరియు ఆక్సిడెంట్ లో చిన్న చిన్న గాయాలు తగిలితే 2 లక్షల వరకు జనసైనికుడి ఆస్పత్రి ఖర్చులు ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్.ఆశయాలు నచ్చిన వారు పార్టీ సభ్యత్వం తీసుకోవాలని నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం అని ఆయన అన్నారు ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుండి మార్చ్ 10 వ తేదీ వరకు ఉంటుంది ఈ సభ్యత్వాలను చేసే వాలంటీర్లకు లింక్ ఇవ్వడం జరిగింది
వారిని మా అధినేత పవన్ కళ్యాణ్. ఒక గొప్ప ఆలోచనతో మూడు పేర్లతో నామకరణం చేశారు
ఉద్యమి అంటే సభ్యత్వం తీసుకునే వారు సాధక్ అంటే సభ్యత్వం చేసే వారిని ప్రదాత అంటే పార్టీ కి బలంగా అన్ని విధాలుగా పార్టీ కోసం పని చేసే వారిని ఇలా మూడు రకాలుగా మా అధినేత నామకరణం చేశారుఈ కార్యక్రమంలో పాల్గొన జనసేన నాయకులు - రామన్ గౌడ్, గౌడి బాల్ రాజ్ రెడ్డి శివ ప్రసాద్ ఉమేష్, శివ, పవన్, కె ప్రవీణ్, విజయ్ కుమార్, రవి కుమార్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
